విద్యార్థి సంఘాల ఆందోళనతో కాకతీయ యూనివ ర్సిటీ అట్టుడికింది. హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కేయూ ఫస్ట్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై నిర్వహించిన రాస్తారోకో మరింత వేడిని రాజేసింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థులను ఈడ్చుకెళ్లడంతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
– హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 1
విద్యార్థి సంఘాల ఆందోళనతో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ అట్టుడికింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఘటనను నిరసిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకొని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. హెచ్‌సీయూ విద్యార్థుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ, అక్కడి భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు కేయూలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి కేయూ మొదటి గేట్ వద్ద దహనం చేసేందుకు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు అక్కడే దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీసులు ఆర్పేందుకు యత్నించారు. అనంతరం విద్యార్థులు మొదటి గేటు వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ విద్యార్థులపై అప్రజస్వామికంగా వ్యవహరిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమిని చదను చేసే యత్నాన్ని అడ్డుకున్న విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ అణచివేసే చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఈ క్రమంలో ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు విద్యార్థుల కాళ్లు, చేతులు పట్టుకొని విచక్షణారహితంగా లాక్కెళ్లి వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వీ, యూఎస్ఎఫ్ఐ, డీఎస్ఏ, ఎంఎస్ఎఫ్, ఎస్ఎస్యూ, బీఎస్యూ, బీఎస్ఎఫ్ సంఘాల నాయకులు మొగి లి వెంకట్ రెడ్డి, బాషబోయిన సంతోష్, బీ నరసింహారావు, బైరపాక ప్రశాంత్, జెట్టి రాజేందర్, మాచర్ల శరత్చంద్ర, సుమన్, మాలోత్ రాజేశ్, శ్రావణ్, గణేశ్, మర్రి మహేశ్, సాయికుమార్, మచ్చ పవన్ కల్యాణ్, శివ నాస్తిక్, యాదగిరి, వేల్పుల చరణ్, ప్రణీత్, వంశీకృష్ణ, వీరు, సూర్యకిరణ్, రంజి త్, దామోదర్, అఖిల్, తిరుపతి పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి చలో హెచ్సీయూకు తరలివెళ్తున్న సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు గా అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించారు. మహబూబాబాద్, జనగామ, పరకాల, ములు గులో ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకున్నా రు. మానుకోటలోని అంబేద్కర్‌సెంటర్‌లో ప్ర భుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి నేతలు దహనం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆప లేరని, విద్యార్థులను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలన్నారు.