Kakatiya University | హనుమకొండ చౌరస్తా, మే 24: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) నూతన ప్రోగ్రాం ఆఫీసర్లను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కంప్యూటర్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీలత, సంస్కృత విభాగానికి చెందిన డాక్టర్ చందర్, కామర్స్ విభాగానికి చెందిన డాక్టర్.రమేశ్‌లకు ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులలో జాతీయ భావాన్ని, క్రమశిక్షణ,శ్రమ, విలువ పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్ ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమింపబడిన వారిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, శ్రీధర్, ఫిరోజ్, శ్రీలత, శ్రీనివాస్, కనకయ్య, రమేష్ కళాశాల బోధనేతర సిబ్బంది అభినందించారు.