స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నియోజకవర్గ శ్రేణులు, ప్రజలు బుధవారం సాయంత్రం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చిన ఆయనకు నెల్లుట్ల క్రాస్ రోడ్ వద్ద గజమాల వేసి పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ తీసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సైతం కడియంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నెల్లుట్ల క్రాస్ నుంచి నిడిగొండ, రఘునాథపల్లి, గోవర్ధనగిరి, రాఘవాపురం, చాగల్ మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్ దాకా ర్యాలీ సాగగా ప్రజలనుద్దేశించి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతే ప్రధానమని, ఇందుకోసం ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్య సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు. తనను నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 23 : బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పార్టీ శ్రేణులు, ప్రజలు నీరాజనాలు పలికారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తొలిసారిగా బుధవారం జనగామ జిల్లాకు వచ్చిన సందర్భంగా వేలాదిగా తరలివచ్చి పూలవర్షం కురిపించారు. హైదరాబాద్‌లో బయలుదేరిన కడియం శ్రీహరి లింగాలఘనపు రం మండలం నెల్లుట్ల క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు ఘన స్వాగ తం పలికారు. అనంతరం నిడిగొండ, రఘునాథపల్లి, గోవర్ధనగిరి, రాఘవపురం, చాగల్ మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చేరుకున్నారు. స్థానిక శివాజీ సర్కిల్ వద్ద ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు కడియం శ్రీహరికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు తనతో చెప్పారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో నియోజవర్గంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేద్దామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనకు ఎజెండా ఉందన్నారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ బలంగా ఉందని, సీఎం కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
Warangal3
లక్ష మెజార్టీతో కానుక ఇవ్వాలి : పల్లా
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గురించి, వారి రాజకీయ జీవితం గురించి ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నేను, ఎమ్మెల్యే రాజయ్య ఎన్నిక ప్రచారంలో పాల్గొంటామని, కడియం గెలుపునకు మా సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. గ్రామాలను గులాబీమయం చేయడంతోపాటు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని, ఇదే ఉత్సాహంతో పనిచేసి కడియం శ్రీహరిని గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కడియం శ్రీహరి ఈ నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా చేస్తారని ఆయన వివరించారు.
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన కడియం శ్రీహరికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కడియం యువసేన సభ్యులు వేలాదిగా తరలివచ్చారు. జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, సర్పంచ్ల ఫోరం స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, జడ్పీటీసీ ఇల్లందుల బేబీశ్రీనివాస్, రైతుబంధు సమితి సభ్యులు రాపోలు మధుసూదన్‌రెడ్డి, తోట వెంకన్న, మార్కెట్ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, అయోధ్య, పార్శి కృష్ణారావు పాల్గొన్నారు.