జనగామ, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాము కుల, మత, పార్టీలకతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని, తమపై నమ్మకంతో ఎమ్మెల్యేలుగా పట్టం కట్టిన ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.