కాశిబుగ్గ మే 14 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా నడుస్తున్న లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం పూర్తి కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక హోటల్ నందు మార్కెట్ వ్యాపారస్తుడు, స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అధ్యక్షతన నూతన అధ్యక్షులు జారితి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గులాం సర్వర్ మున్నా, కోశాధికారి మల్లూరి బాబురావు, ఆధ్వర్యంలో నూతన కమిటీని 81 మందితో ఏర్పాటు చేశారు.
మార్కెట్ వ్యాపారస్తులు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేష్, గులాం అఫ్జల్, మజీద్ అహ్మద్ బాబా, కర్ర వెంకన్న, పార్ష గోపి, కర్ర నాగేశ్వర్ రావు, చింతాకుల సునీల్, దేవరపల్లి ఆనంద్ ,బిక్షపతి, సదానందం, ప్రతిపాదన మేరకు కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అనిల్ కుమార్, జగతి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి నిర్ణయంతో అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ జంబో కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమైన నిర్ణయం అన్నారు.
మార్కెట్ అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేట్టుగా స్థానిక నాయకులు, మంత్రి కొండా సురేఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్న మల్లేశం, జాల రాజేందర్, భారతి వెంకన్న, మోయిద్ కర్ణాకర్, సూరం రాజేందర్, హరి, ప్రసాద్, రాజకుమార్, సుధాకర్, నాగరాజు, విజయ్, అనిల్ పాల్గొన్నారు