Journalists | భూపాల్లపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు.
అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వారి పర్యటనను పాత్రికేయులు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు.