గంగారం జూన్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక జిల్లా నాయకుడు జోగ రామయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వ్యవసాయ కూలీలకు షరతులు లేకుండా ఆత్మీయ భరోసా పథకం కింద 12 వేల రూపాయలు అందించాలన్నారు. లేదంటే ఈ నెల 15న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు వీరస్వామి, కాంతారావు, బుచ్చిరాములు పాల్గొన్నారు.