ఆర్ఎంయూలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మరో ఉద్యమం చేపడదామని రైల్వే జాక్, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించా రు. జంక్షన్ పరిసర ప్రాంతంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
- 80 శాతం ఇవ్వకుంటే మరో ఉద్యమం
- 19న పాదయాత్ర.. ఆగస్టులో జంతర్‌మంతర్ వద్ద ధర్నా
- విలేకరుల సమావేశంలో తెలంగాణ రైల్వే జాక్, ప్రజా సంఘాలు వెల్లడి
కాజీపేట, జూలై 8 : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మరో ఉద్యమం చేపడదామని రైల్వే జాక్, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించా రు. జంక్షన్ పరిసర ప్రాంతంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వే దిక కో ఆర్డినేటర్ చుక్కయ్య, మాలమహానాడు రాష్ట్ర నాయకుడు మన్నే బాబురావు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంద కుమార్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్, కన్వీనర్ కొండ్ర నర్సింగరావు, దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడారు. ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందనే నమ్మకంతో రైతులు ఆర్ ఎంయూకు భూములు అప్పగించారన్నారు.
ఇంటిగ్రే టేడ్ కోచ్ ఫ్యాక్టరీకి ఆర్ఎం యూ నిర్వహణ బాధ్యతలు, టెండర్ ప్రక్రియను అప్పగించామని రైల్వే బోర్డు చైర్మన్ చెప్పడం, దాన్ని ప్రైవేట్‌కు అప్పగించడమేనని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీల్లో కేంద్రం భూ నిర్వాసితులు, స్థానికులకు 80% ఉద్యోగాలు ఇచ్చిందని, అదేవిధంగా ఇక్కడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంయూలో స్థాని కులకు ఉద్యోగాలు కల్పించేందుకు, రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కేంద్రంపై పాలకులు ఒత్తిడి చేయాలని, లేకుంటే వారి ఇండ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఆగస్టులో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఈ నెల 19న మడికొండ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ వరకు పాద యాత్ర నిర్వహించనున్నట్లు తె లిపారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు సమ్మయ్య, కేటీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాంబయ్య, సీపీఐ నాయకుడు మద్దెల ఏలేశ్, మాలోత్ శంకర్‌నాయక్, బీసీ హక్కుల రాష్ట్ర కార్య దర్శి నేదునూరి రాజమౌళి, టీజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భరత్, డెమోక్రటిక్ స్టూడెంట్ కన్వీనర్ శ్రవణ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాంచందర్, సీఐటీయూ నాయకుడు కారు ఉపేందర్, టీపీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగామ కుమారస్వామి, రైల్వే జేఏసీ కో కన్వీనర్లు అనుమాల శ్రీని వాస్, భాస్కర్, వస్కుల రవీందర్, రాజయ్య, కాడబోయిన లింగయ్య యాదవ్, రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

