ములుగు : ఇటీవల మేడారం ( Medaram ) లో జరిగిన ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్( Ramesh ) భార్యకు ప్రభుత్వం ఉద్యోగ ( Government Job ) అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, చేతుల మీదుగా దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి,మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.