నర్సంపేట, ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గంలో 22 హెల్త్ సబ్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మా ణం కోసం రూ.4.40 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జీవో కాపీ అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలోని 90 శాతం హెల్త్ సబ్‌సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు.
కరోనా నేపథ్యంలో ఇంటి య జమానులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నా రు. ఇప్పటికే స్థలాలను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మరో నాలుగు నెల ల్లో అన్ని సబ్ సెంటర్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 59 సబ్ సెంటర్లకు శాశ్వత భవనాలను మంజూ రు చేయించడం సంతోషంగా ఉందన్నారు. శాశ్వత భవనాలమంజూరు కు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మొత్తం 59 సబ్ సెంటర్లలో ఇప్పటి వరకు 57 సెంటర్లకు శాశ్వత భవనాలు మంజూరయ్యాయని తెలిపారు.