Inter Hall Tickets | రేపు ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల
Inter Hall Tickets | ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 18న విడుదలకానున్నాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు కాలేజీ లాగిన్‌లో పొందుపరుచనున్నది.
Inter Hall Tickets | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 18న విడుదలకానున్నాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు కాలేజీ లాగిన్‌లో పొందుపరుచనున్నది. ఈ నెల 20న విద్యార్థులు/ తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్‌నకు హాల్‌టికెట్లను పంపిస్తారు. బోర్డు వెబ్సైట్లోను హాల్‌టికెట్లను పొందుపరుస్తారు. విద్యార్థులు కాలేజీ లాగిన్ ఐడీ, ఇంటర్ వెబ్సైట్, వాట్సాప్‌నకు పంపించిన హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. పేరు, ఫొటో, సబ్జెక్టుల్లో తప్పులు దొర్లితే కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రిస్తున్నారు. పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌తో అనుసంధానించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 9,96,529 మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు. 1,495 సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఇంటర్‌బోర్డు ముందు ఏబీవీపీ మెరుపుధర్నా
ఇంటర్ హాల్‌టికెట్లు జారీకాని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ సోమవారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగింది. పేద విద్యార్థులతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదని, అధికారులు స్పందించి హాల్‌టికెట్లు జారీచేయాలని హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వీతేజ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

