చారిత్రక ఆలయాలకు నిలయం : వరంగల్ సీపీ తరుణ్‌జోషి
కొమ్మాల జాతరలో పోలీస్ కంట్రోల్ రూం ప్రారంభం
గీసుగొండ, మార్చి 14 : జిల్లాలో అత్యధిక దేవాలయాలు ఉన్నాయని, వరంగల్ దేవభూమి అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. నర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 32 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు భక్తిభావం అధికమన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతవరణంలో దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈస్టుజోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఈవో శేషగిరి, ఆలయ ఫౌండర్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి, సీఐలు రాయల వెంకటేశ్వర్లు, రమేశ్‌నాయక్, ఎస్సైలు పెండ్యాల దేవేందర్, వెంకన్న, శ్వేత, సర్పంచ్‌లు వీరాటి కవిత, జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్రావు, బోడకుంట్ల ప్రకాశ్, వాంకుడోత్ రజిత, కార్పొరేటర్ ఆకుల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.