తిలకించి తరించిన భక్తులు
హాజరైన ఎమ్మెల్యే సతీమణి చల్లా జ్యోతి
గీసుగొండ, మార్చి 14 : కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సోమవారం రాత్రి అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారికి ఉదయం నిత్యహోమం, ధ్వజారోహనం, బలిహరణం కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. రాత్రి ప్రత్యేక పూజల తర్వాత స్వామి వారికి భక్తుల కోలాహలం నడుమ శ్వవాహనంపై గుట్ట పైనుంచి కిందికి తీసుకువచ్చి గుట్ట చుట్టూ ఊరేగించారు. భూదేవి, నీలాదేవిలను కూడా భక్తులు పల్లకీలో గుట్ట పైనుంచి కిందకు తీసుకవచ్చారు. కల్యాణ మండలం వద్ద ఎదుర్కోళ్లు నిర్వహించి, కల్యాణం మండపానికి తీసుకువచ్చారు. భక్త జనుల నడుమ భూదేవి నీలాదేవి సమేత లక్ష్మీనర్సింహాస్వామి కల్యాణంవైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు పాల్గొన్నారు. భూదేవి నీలాదేవీ సమేత లక్ష్మీనర్సింహస్వామి వారికి పట్టు వస్ర్తాలను, ముత్యాల తంబ్రాలను సమర్పించారు. ఆలయ ఫౌండర్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, కొమ్మాల సర్పంచ్ వీరాటి కవిత, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచులు రజిత, అంకతీ నాగేశ్వర్రావు, సరోజన, అమ్మి, బోడకుంట్ల ప్రకాశ్, పూండ్రు జైపాల్‌రెడ్డి, బాబు, ఈవో శేషగిరి, రవీందర్‌రెడ్డి, స్వామిచౌహాన్, బాలరాజు, మాధవరెడ్డి చంద్రారెడ్డి, లెనిన్ పాల్గొన్నారు.