బహుళార్థ సేవా కేంద్రాల ఏర్పాటుకు రుణాలు
రెండో విడుతలో భాగంగా చెక్కులు అందజేసిన డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
సుబేదారి, మార్చి14: 15 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల్లో బహుళార్థ సేవా కేంద్రా ల ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.9.40 కోట్ల రుణాన్ని అందజేసింది. రెండో విడుత రుణ మంజూరు లో భాగంగా డీసీసీ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు వాటికి సంబంధించిన చెక్కులను అందజేశారు. సోమవారం హనుమకొండ అదాలత్లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మన్నెగూడెం సొసైటీకి రూ.22లక్షలు, పర్వతగిరి సంఘానికి రూ. 30లక్షలు, నర్సింహులపేటకు రూ. 33 లక్ష లు, నెల్లికుదురుకు రూ. 30లక్షలు, తొర్రూరుకు రూ. కోటి 15 లక్షలు, మొగిలిచర్లకు రూ. 40లక్షలు, సంగెంకు రూ. 74 లక్షలు, అమీనాబాద్కు రూ. 56లక్షలు, బచ్చన్నపేటకు రూ. కోటి, వర్ధన్నపేటకు రూ. 61లక్షలు, మరిపెడకు రూ. 75లక్షల చొప్పున రుణాల చెక్కులను బ్యాంకు చైర్మన్ ఆయా సంఘాల చైర్మన్లు, సీఈవోలకు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ సంఘాలను ఆర్థిక పరిపుష్టిలోకి తీసుకురావడానికి వాటి పరిధిలో ఉన్న వ్యాపార లావాదేవీల అనూకూలతలను పరిగణలోకి తీసుకొని బహుళార్థక రుణాల అందజేశామని అన్నారు.