హనుమకొండ/వరంగల్, మార్చి 14: రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావును కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ సోమవారం కలిశారు. కుడా చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆ యనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపా రు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వ ర్లు, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి సమక్షంలో కుడా చైర్మన్ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతోందని, తమ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధిక ప్రాధాన్యమి స్తోందన్నారు. నగరానికి ఇప్పటికే పలు ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చాయని, త్వరలో మరిన్ని రానున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కుడా చైర్మన్‌గా నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనం తరం సుందర్రాజు యాదవ్‌ను ప్రత్యేకంగా మం త్రి కేటీఆర్ అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.