ఖిలావరంగల్, మార్చి 14: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అగ్రి హ్యాకథాన్‌కు అపూర్వ స్పందన లభించింది. వ్యవసాయ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్‌ల కు తెలంగాణ ప్రభుత్వ రీచ్, వాగ్దేవి కళాశాలలు కలిసి నిర్వహించే ఈ అగ్రి హ్యాకథాన్ వేదికగా మారింది. 120 గ్రూప్స్‌తో 250 మంది విద్యార్థు లు తమ ఆవిష్కరణలకు పదును పెట్టనున్నారు. వ్యవసాయంలో సవాళ్లు, వాటి పరిష్కారం కోసం నూతన ఆలోచనలు, నిపుణుల సహకారంతో మార్గదర్శకత్వం కల్పించి విద్యార్థులకు ప్రోత్సాహ క బహుమతులను ఆందజేసేందుకు నిర్వాహకు లు ఏర్పాట్లు చేశారు. విభా, సీబీటీటీ ఇంక్యుబేషన్ సహాయ సహకారాలతో మొదటి బహుమతి రూ. 30వేలు, ద్వితీయ బహుమతి రూ.20వేలు అందించనున్నారు. మొదటి రోజు సోమ వారం అగ్రి హ్యాకథా న్ను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ రమణా రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్ర జ్వలన చేశారు. నూతన ఆవిష్కరణలో భా గంగా వివిధ రంగాల్లో సఫలీకృతులైన సైంటి స్టులు, మేధావుల గురించి వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని కల్పించారు. కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్, రిచ్ డైరెక్టర్ బూబేష్కుమార్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే ప్రకాశ్, ప్రొఫెసర్ ప్రసాదరావు, ఏసీఐసీ, సీబీటీఐ, డీన్ ప్రొఫెసర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.