ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్‌ది గొప్ప నిర్ణయం
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని
వరంగల్, మార్చి 9(నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకానికి తీసుకున్న నిర్ణయం గొప్పదని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. యువత ఉద్యోగాల జాతరకు సిద్ధం కావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త చెబుతూ బుధవారం శాసనసభ వేదికగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే నరేందర్ అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ‘యువత జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్‌కు శతకోటి వందనాలు. ఇది గొప్ప నిర్ణయం. యువత ఉద్యోగాలకు సన్నద్ధం కావాలి. ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల కలను సంపూర్ణంగా నిజం చేశారు. యువత భవిత మార్చేలా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.’ అని ఆయన అన్నారు.