Gaurav Gogoi | ‘హిమాంత బిశ్వశర్మ అస్సాం జిన్నా’.. గౌరవ్ గొగోయ్ విమర్శలు
Gaurav Gogoi | అస్సాం (Assam) రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Gaurav Gogoi : అస్సాం (Assam) రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేనివారిగా మిగిలిపోతారని విమర్శించారు.
గువాహటిలో గొగోయ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై గొగొయ్ మాట్లాడుతూ.. కమలంలో చేరితే బోరా కూడా ప్రాధాన్యం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోరాటం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీని వీడిన వారికి మధ్య ఉంటుందని గొగోయ్ అన్నారు. బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ మాజీ నాయకులు ఉన్నారని, అవినీతిపరులని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మపై విమర్శలు చేశారు. బోరా కాంగ్రెస్ను వీడటంవల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

