న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) గ్రూప్ డీ మ్యాచ్‌లో ఇవాళ దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. దీంతో తమ గ్రూపులోని అన్ని మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విక్టరీ నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. టాపార్డర్‌లో అలీషాన్ షారఫూ అత్యధికంగా 45 రన్స్ చేశాడు. అయితే ఆ టార్గెట్‌ను కేవలం 13.2 ఓవర్లలో సఫారీలు అందుకున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ రికల్టన్ 16 బంతుల్లో 30 రన్స్ చేయగా, బ్రెవిస్ 25 బంతుల్లో 36 రన్స్ స్కోరు చేశారు. మరో 40 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా విజయ కేతనం ఎగురవేసింది. సఫారీ బౌలర్ కార్బిన్ బాష్ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. గ్రూపు డీ నుంచి ఇప్పటికే దక్షిణఫ్రికాతో పాటు న్యూజిలాండ్ .. సూపర్-8 స్టేజ్‌కు క్వాలిఫై అయ్యాయి.
Corbin Bosch was right on the money with the ball as he set South Africa on their way to a win against UAE👊
He is the @aramco POTM👌
📝: https://t.co/dD4T04zMqE pic.twitter.com/5GPeBbA8nx
— ICC (@ICC) February 18, 2026