భూపాలపల్లి : భూపాలపల్లి మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు. రఘుపతిరావు తల్లి జానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం రఘుపతిరావు స్వగ్రామమైన భూపాలపల్లి మండలం గుడాడ్‌పల్లిలో రఘుపతిరావు తల్లి చిత్రపటానికి వినోద్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రఘుపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ తాళ్లపల్లి సురెందర్, సర్పంచ్ ఉడుత లక్ష్మి ఐలయ్యలు ఉన్నారు.