చిట్యాల, జులై 05 : రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులంతా బాసటగా నిలిచారు. అందరూ కలిసి చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమ చేశారు. స్నేహితుని దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
జయశంకర్ భూపాలపల్లి మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు తాజాగా అతని కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్నేహితుని కుటుంబ దీనస్థితిని తెలుసుకుని తమవంతుగా చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమచేశారు. ఆ డబ్బును దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. తమ స్నేహితుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
జీవితంలో ఎంతో మంది మీకు మేమున్నాం అని చెప్తుంటారు.. కానీ ఆచరణలో నిలిచేది ఎంతమంది? అలా నిలిచేవారే నిజమైన స్నేహితులనీ పలువురు మిత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం రాపెల్లి రాజు, చింతల శివ, మురళీకృష్ణ, మార్క చంద్రశేఖర్, మనోహర్, తిరుపతి, ఉదయ్ కిరణ్ , రంజిత్ , సురేందర్ , రాజేందర్, పవన్, భార్గవ్, అరవింద్, శేఖర్, సూర్యం, వినయ్, నరేష్, నరేష్(వెలిశాల), నవీన్, ప్రభాకర్, కుమార్, మార్కండేయ, సురేష్, కరుణ, రామ్ చరణ్, అభిరామ్, నవీన్, స్వామి, శివ, సతీష్, రవి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.