మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేశారు. పరీక్షలో నెగెటివ్ రావడంతో ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.
దీంతో అప్పటికే ఊపిరితిత్తుల్లో నిమోనియా చేరి చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతిచెందాడు.