చిట్యాల: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తున్నదని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు కైలాపూర్, శాంతినగర్, రామచంద్రపూర్ గ్రామాలకు చెందిన రూ.1.34లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు గురువారం స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ..పేద ప్రజలు ప్రైవేట్ అసుపత్రుల్లో చికిత్స పొంది మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు.
కరోనా వంటి విపత్కర పరస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరెపల్లి మల్లయ్య, మడికొండ రవీందర్రావు, బీసీ సెల్ అధ్యక్షుడు జాలిగపు కిష్టయ్య, స్థానిక సర్పంచులు చింతల శ్వేతాసుమన్, షంషోద్ధీన్ నాయకులు దానవేన రమేష్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.