మలహార్, ఫిబ్రవరి 6 : ఎన్నికల్లో గెలిపిస్తే తాడిచెర్ల -భూపాలపల్లి రోడ్డు పూర్తి చేస్తామని నాడు శ్రీధర్ బాబు హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలిచాక ఆ ఊసే ఎత్తడంలేదు. మంత్రి శ్రీధర్‌బాబుకు(Minister Sridhar Babu) పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై ఉండదా? బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) అన్నారు. ఈ సందర్భంగా మలహార్ మండల కేంద్రంలో తాడిచెర్లలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు, మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ తాజొద్దీన్ మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని- తాడిచెర్ల రోడ్డు పూర్తి చేసి తాడిచేర్ల వంతెన నిర్మించారు. అలాగే తాడిచెర్ల-కిషన్ రావు పల్లి రోడ్డు పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారు.
కానీ, 14నెలలు కావస్తున్నా మంత్రి ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పుట్ట మధుకర్‌కు పేరు వస్తదనే దురుద్దేశంతోనే రోడ్డు నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 5కోట్ల రూపాయలు వెచ్చించి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మీ అబద్ధపు వాగ్దానాలను ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మాజీ సర్పంచ్ సుంకరి సత్తయ్య, మాజీ ఎంపీటీసీ రావుల కల్పన, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మల్క నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నమనేని మధుసూదన్ రావు, నారా రమేశ్, నారా సమ్మయ్య, బొంతల రమేశ్, మల్క కిషన్, కామ శంకర్, తిక్క వినయ్ పాల్గొన్నారు.