ఇద్దరి నుంచి రూ. పది వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటలక్ష్మి
సుబేదారి/ఖానాపురం, డిసెంబర్ 28: వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలోని ఖానాపురం మండలం బుధ రావుపేట గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ఈ మేరకు బుధవారం హనుమ కొండలోని పోలీసు కమిషనరేట్‌లో నిందితుల వివరా లను ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వెల్లడించారు. బుధరావుపేటకు చెందిన ఎర్రబెల్లి అనిల్ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణం నిర్వహించేవాడు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అదే గ్రామానికి చెందిన మరో నిందితుడు మల్యాల భరత్‌తో కలిసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై తెలిసిన యువకులతో కలిసి ఇద్దరు బెట్టింగ్ నిర్వహించేవారు. ఇందులో గెలిచి న వారి నుంచి పది శాతం కమీషన్ తీసు కునేవారు. ఈ నెల 26న బెట్టింగ్‌లో పాల్గొన్న యువకు డు డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులు అతని ఇంటికి వెళ్లి బలవంతంగా బైక్ తీసుకొచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి అనిల్, భరత్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసీపీ ఫణీందర్, నర్సంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, ఖానాపురం ఎస్సై నవీన్‌కుమా ర్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.