పాలకుర్తి వరకు టీఆర్ఎస్ శ్రేణుల పాదయాత్ర
తొర్రూరు, డిసెంబర్ 28: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మంగళపల్లి వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వరకు పాదయాత్రగా టీఆర్ఎస్ అనుబంధ సంఘాల యువత బయల్దేరారు. పాదయాత్రను మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్, వైస్‌చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో మంగళపల్లి వినయ్‌కుమార్, సుధాకర్, వీ రమేశ్. జీ రంజిత్, జీ శేఖర్, బీ ప్రశాంత్, బీ ప్రశాంత్, ఎం ప్రశాంత్, ఎన్ వంశీ, ఈ శ్రీకాంత్ ఉన్నారు. కాగా, సన్నూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జీ సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బీ అనిల్, డీ శంకర్, డీ జైసింగ్, మణిరాజ్, కే శ్రీనివాస్ పాల్గొన్నారు.
సన్నూర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..
పెద్దవంగర : మంత్రి దయాకర్‌రావు త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ మండల నాయకులు వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, సన్నూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చిట్యాలలో మాజీ ఎంపీటీసీ రహీముద్దీన్ ఆధ్వర్యంలో ముస్లింలతో కలిసి మసీదులో ప్రత్యేక నమాజ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా, మండల సభ్యులు నెహ్రూనాయక్, సోమ నర్సింహారెడ్డి, బొమ్మకల్లు సర్పంచులు దీపికారెడ్డి, భాస్కర్‌రావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, నాయకులు నాగేశ్వర్రావు, రవిచందర్‌రెడ్డి, వెంకట్రామయ్య, ఆర్ గంగాధర్‌యాదవ్, పూర్ణచందర్యాదవ్, కుమారస్వామి, ఐలయ్య, రవి, సమ్మయ్య, వెంకన్న, ఇబ్రహీం, మైబాషా, సలీం, అక్బర్, ముజీబ్