ఎమ్మెల్యే అరూరి రమేశ్
చెన్నారంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డుకు ప్రారంభోత్సవం
ఎస్సీ, గౌడ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
వర్ధన్నపేట, డిసెంబర్ 28 : పల్లెల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం గ్రామంలో మంగళవారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రహరీని ప్రారంభించారు. అలాగే, ఎస్సీ, గౌడ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అన్ని గ్రామాల్లో అవసరం మేరకు సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలను గుర్తిస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీవో నాగేశ్వర్, ఉపసర్పంచ్ రాజమౌళి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పర్వతగిరి : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఏనుగల్లు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు తక్కళ్లపల్లి భాస్కర్‌రావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగేంధర్‌రావు, జడ్పీటీసీ సింగ్‌లాల్, నర్సింగం, వెంకట్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.