అపోహలు వీడండి
అదనపు కలెక్టర్ దివాకర హామీ
మల్హర్, డిసెంబర్ 28 : తాడిచెర్ల జెన్కో ప్రాజెక్టు కింద ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, అపోహలు వీడి ఏమైనా సందేహాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ దివాకర అన్నారు. తాడిచెర్ల, కాపురం గ్రా మాల్లోని నిర్వాసితులతో మంగళవారం ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి అదనపు కలెక్టర్ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్ర కారం భూములు కోల్పోయిన ప్రతి నిర్వాసితుడికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, నష్ట పరిహారం అం దుతుందన్నారు. తాడిచెర్ల శివారులో కొనుగోలు చేసిన సదరు భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాలు రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. డేంజర్ జోన్లో ఉన్న గృహాలకు నంబరింగ్ చేసిన సంఖ్య వివరాలు జెన్కో, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డేంజర్ జోన్లో ని ఇండ్లు, స్థలాలను జెన్కో అధికారుల ద్వారా సర్వే చేయడం పూర్తయిందన్నారు. త్వరలోనే సోషల్ ఎకనామికల్ సర్వే చేయించి లబ్ధిదారుల పేర్లు , ఇంటి వివరాలతో డీఎన్ పబ్లిష్ చేయనున్నట్లు వెల్లడించారు. స్థానికేతరులు అక్రమంగా నిర్మించుకున్న ఇంటి నిర్మాణాల వివరాలను గు ర్తించి రెవెన్యూ పంచాయతీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. స్థానికేతరుల ఓటరు కార్డులో అక్రమంగా పేర్లు, చిరునామా తదితర మార్పులు చేసినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నర్సింహమూర్తి , డీటీ శ్రీనివాస్, ఎంపీపీ మల్హల్ రావు, భూ నిర్వాసిత సంఘం అధ్యక్షుడు దండు రమేశ్, నిర్వాసితులు గట్ట య్య, సత్యనారాయణ, కేసారపు చంద్రయ్య, ఉ ప సర్పంచ్ ఇందారపు చంద్రయ్య, సమ్మయ్య, ఆర్ఐ సరిత, సర్వేయర్ కరుణాకర్, ఏఎంఆర్ కంపెనీ పీఆర్వో వెంకట్ ఉన్నారు. అనంతరం తాడిచెర్ల ఏఎంఆర్ ఓసీపీ ప్రాజెక్టును అదనపు కలెక్టర్ సందర్శించి బొగ్గు వెలికితీత పనులను పరిశీలించారు. ప్రాజెక్టు జీవిత కాలం, బొగ్గు నిల్వలను అడిగి తెలుసుకున్నారు.