ఫర్నిచర్ సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం
కుర్చీలు, టేబుళ్లు.. ఏడు రకాలు ఏర్పాటు
జిల్లాలోని 45 వేదికలకు చేరిక
మొత్తం రూ.61లక్షలు కేటాయింపు
ఒక్కోదానికి రూ.1.35లక్షల చొప్పున ఖర్చు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ):రైతు వేదికల్లో కొత్త కళ సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయంలో ఆధునిక సమాచారం, ఇతర విషయాలపై అవగాహన కల్పించేందుకు రూ.22లక్షల చొప్పున ఖర్చుతో రైతువేదికలను నిర్మించింది. విశాలమైన స్థలం, ఆవరణలో పచ్చని గార్డెన్తో అవి ఆకట్టుకుంటున్నాయి. రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను తాజాగా సమకూర్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 45 రైతువేదికలకు రూ.61,02,405 కేటాయించింది. ఒక్కో రైతువేదికలో రూ.1,35,609 చొప్పున ఖర్చుతో ఏడు రకాల వస్తువులను సమకూర్చింది. ఇందులో బీరువా, పెద్దటేబుల్, చిన్న టేబుల్, మైక్‌సెట్, ఎగ్జిక్యూటివ్ చైర్, ఎస్ ఆకారపు కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని రైతు వేదికలకు ఫర్నిచర్‌తో కొత్త కళ వచ్చింది. రైతులకు వ్యవసాయంలో ఆధునిక సమాచారం తెలియజేయడం, సాగులో మెళకువలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 45 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లస్టర్‌కు రూ.22లక్షల వ్యయంతో విషాలమైన రైతువేదిక భవనాలను నిర్మించింది. ఇందులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ, అవగాహన సదస్సులు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినందున యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి వివరిస్తు న్నారు. అయితే వాటిలో తగిన సౌకర్యాల కల్పనలో భాగంగా సమావేశాలు నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమకూర్చింది.
చేరుకున్న ఫర్నిచర్
జిల్లాలోని 45 రైతువేదికలకు ఏడు రకాల ఫర్నిచర్ చేరుకుంది. ఇందుకు మొత్తం రూ.61,02,405 కేటాయించింది. ఒక్కో రైతువేదికలో ఫర్నిచర్ కోసం రూ.1,35,609 చొప్పున ఖర్చు చేసింది. రైతు వేదికలకు ఏడు రకాల ఫర్నిచర్ చేరుకుంది. అందులో బీరువా, పెద్ద టేబుల్, చిన్న టేబుల్, ఎగ్జిక్యూటివ్ చైర్, మైక్‌సెట్ ఒక్కొక్కటి చొప్పున, ఎస్ ఆకారపు కుర్చీలు ఎనిమిది, ప్లాస్టిక్ కుర్చీలు 125 సరఫరా చేసింది. ఫర్నిచర్‌తో అన్ని రైతు వేదికలు కళకళలాడుతుండగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతుల కోసం ప్రభుత్వం నిర్మించిన రైతువేదికలను సద్వినియోగం చేసుకోవా లి. గతంలో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉండేవి. దీంతో ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసింది. ప్రతి రైతు వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరు కావాలి.