జిల్లాలో 1,46,405 మంది రైతులకు లబ్ధి
లబ్ధిదారుల్లో ఎస్సీలు 12,057, ఎస్టీలు 29,088 మంది
నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ
ఇప్పటికే ట్రెజరీకి అర్హుల జాబితా
యాసంగి పంటలకు ఉపయోగపడుతుందని అన్నదాతల సంతోషం
వరంగల్, డిసెంబర్ 27(నమస్తేతెలంగాణ) : రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం మంగళవారం నుం చి రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం పంపి ణీ చేయనుంది. దశల వారీగా జిల్లాలో 1,46,405 మంది రైతులకు రూ.136,26,74,447 ఆర్థికసాయం అందజేయనుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాం కు ఖాతాల్లో జమ చేయనుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున రెండు విడుతల్లో అందజేస్తున్నది. వీటిలో వానకాలం పంటకు రూ.5 వేలు, యాసంగికి మరో రూ.5 వేలు ఇస్తున్నది. యాసంగి పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల జాబితాను పరిశీలించారు. రెండో విడత పంట పెట్టుబడి సాయం విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ట్రెజరీకి లబ్ధిదారుల జాబితాను పంపింది. దీని ప్రకారం మొదట గుం ట భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా గుంటలు, ఎకరం, రెం డు ఎకరాలు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉ న్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.
రాయపర్తి మండలంలో అత్యధికం..
రైతుబంధు పథకం ద్వారా రైతులు లబ్ధి పొందుతు న్న మండలాల్లో రాయపర్తి టాప్‌లో ఉంది. ఈ మండలంలో పెట్టుబడి సాయం పొందుతున్న రైతులు 17,895మంది ఉన్నారు. వీరికి రూ.20,47,29,826 ఆర్థిక సహాయం అందనుంది. 14,316మంది లబ్ధిదారులతో సంగెం మండలం రెండో స్థానంలో ఉంది. వీరి కి రూ.13,08,21,878 పెట్టుబడి సాయం లభించనుంది. ఖానాపురం, నెక్కొండ, పర్వతగిరి మండలా ల్లో 13వేల మందికిపైగా ఉంటే వర్ధన్నపేట, నల్లబెల్లి, గీసుగొండ మండలాల్లో 12వేల మందికిపైగా ఉన్నా రు. అతి తక్కువగా వరంగల్ మండలంలో 2,064 మంది రైతులు ఉన్నా. ఖిలావరంగల్ మండలంలో 5,249మంది లబ్ధి పొందనున్నారు. మొత్తం రైతుల్లో జనరల్ 1,05,260, ఎస్సీలు 12,057, ఎస్టీలు 29,088, మంది ఉన్నారు. పెట్టుబడి సాయం అందనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతు బంధు గొప్ప వరం..