భక్తిశ్రద్ధలతో అగ్ని గుండాల మహోత్సవం
హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, డిసెంబర్ 27 : చారిత్రక ఓరుగల్లు కోటలో భక్తి శ్రద్ధలతో అగ్ని గుండాల మహోత్సవాన్ని అయ్యప్ప భక్త కమిటీ ఆధ్వర్యంలో ని ర్వహించారు. ఆదివారం రాత్రి భద్రకాళీ భద్రేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అ య్యప్ప మాలధారులు, భక్తులు అగ్నిగుండంలో నడిచారు. రాతికోట తూర్పు ద్వారం వద్ద పద్దెనిమిది మెట్లతో అయ్యప్ప స్వామి మండపాన్ని ఏ ర్పాటు చేశారు. రామకృష్ణశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప భజన పాటలతో కోట మార్మోగింది. అనంతరం సుమారు 5 వేల మందికి అన్నదానం చేశారు.
అయ్యప్ప ఆశీస్సులతో అందరూ బాగుండాలి : ఎమ్మెల్యే నన్నపునేని
తూర్పు రాతి కోట సింహ ద్వారం వద్ద రెండు రోజుల పాటు కనుల పండువలా సాగిన అయ్యప్పస్వామి మహా పడిపూజకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేను భక్తి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలన్నారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎ ర్రబెల్లి ప్రదీప్రా వు, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, దిడ్డి కుమారస్వామి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు భోగి సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్ల కవిత, నిర్వాహకులు ధర్మరాజు, శివ, నాయకులు బిల్ల రవి, కం దిమల్ల మహేశ్, అర్సం రాంబాబు, సంగరబోయిన ఉమేశ్, సంగరబోయిన చం దర్, మంద శ్రీధర్‌రెడ్డి, సిరబోయిన వాసుదేవ్, పిట్టల కిరణ్, బెడద వీరన్న, అమర్, కరుణాకర్ పాల్గొన్నారు.
కుటుంబానికి అండగా ఉంటా..
కరీమాబాద్ : ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు దబ్బెటి మహేశ్ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని భరోసా ఇచ్చారు. పెరుకవాడలోని క్యాంపు కార్యాలయం లో మృతుడి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు అందజేశారు. టీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్ ఆ ధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎ మ్మెల్యే ఆవిష్కరించారు. నాయకులు నాగపురి సంజయ్‌బాబు, వల్లకట్ల ధనలక్ష్మి, దుబ్బ శ్రీనివా స్, మీరిపల్లి వినయ్, టీ నర్సింగం పాల్గొన్నారు.