ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
దత్తత గ్రామంలో పర్యటన
టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, డిసెంబర్ 27 : వరికోల్ తరహాలో రామవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా దత్తత తీసుకున్న రామవరంలో సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు సమస్యలపై ప్రజలతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామనన్నారు. అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. అంతర్గత సీసీరోడ్ల నిర్మా ణం కోసం రూ.కోటి కేటాయించామన్నారు. మినీ ఫంక్షన్‌హాల్‌కు రూ.50లక్షలు, చేనేత కార్మికులకు యంత్రాలను అందించడంతో పాటు పాఠశాల భవన నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారుల అంచనా మేరకు నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని వివరించారు. గ్రామస్తులంతా సంఘటితంగా ఉంటూ అభివృద్ధి పనులు పూర్తి చేయించుకోవాలని సూచించారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి పాల్గొన్నారు.