కేంద్రం బృందం సభ్యురాలు అంజలి
పాల్గొన్న అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మండల అధికారులు
బచ్చన్నపేట, డిసెంబర్ 26 : గ్రామంలో అన్ని రంగా ల్లో అభివృద్ధి జరిగిందా అమ్మా.. ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందా..? అంటూ స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యురాలు అంజలి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మండలంలోని గంగాపూర్లో స్వచ్ఛసర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించడంతో పాటు గ్రామంలో వ్యక్తి గత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అమ్మా 2014 స్వచ్ఛభారత్ కార్యక్రమం వచ్చాక గ్రామంలో పారిశుధ్యం నిర్వాహణ ఎలా ఉందని ప్రజల నుంచి సమాదానం రా బట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘురామకృష్ణ, సర్పంచ్ బందారపు సుశీల, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, రూపాచైతన్య, కల్యాణి, రుబీనాసుల్తానా, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమతి, అంగన్వాడీ టీచర్ గూ డెంల సంతోష, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.