తాళ్లగడ్డలో రెండేండ్ల కింద హ్యాండిల్, పైపులు తొలగించి మోటర్ ఏర్పాటు
హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నీటి వాడకం
మళ్లీ బిగించకపోవడంతో తాగునీటికి తిప్పలు
ఏటూరునాగారం, డిసెంబర్ 23 : పాఠశాల ఆవరణలోని చేతిపంపు నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం కొసాగుతోంది. హ్యాండిల్, పైపులు తొలగిచి ఏండ్లు గడుస్తున్నా తిరిగి బిగించలేదు. దీంతో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ప్రాంత గిరిజన ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేతిపంపు ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులకు తాగునీటికి, కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగపడేది. ఈ సమయం లో పాఠశాల పక్కనున్న ఐటీడీఏ ఆధ్వర్యంలో హెల్త్ సబ్ సెంటర్ కమ్ అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణ పనులు చేపట్టారు. చేతిపంపు హ్యాండిల్, పైపులను తీసి పాఠశాలలో ఓ మూలన పడేసి, సబ్మెర్సిబుల్ మోటార్ బిగించి నీటిని ఉప యోగించున్నారు. భవన నిర్మాణం పూర్తయి ఏడాది దాటుతు న్నా చేతిపంపు పైపులు, హ్యాండిల్‌ను మళ్లీ బిగించలేదు. దీంతో మధ్యాహ్న భోజన సమయంలో పక్కనున్న దుకాణంలో వాటర్ క్యాన్ కొని విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు దాహం వేస్తే బయ టకు వెళ్తున్నట్లు చెప్పారు. పాఠశాల ఆవరణలోని టాయిలెట్స్‌కు కూడా నీటి సదుపాయం లేదు. ఈ బోరు నుంచి పక్క భవనా నికి వాటర్ సరఫరాకు కనెక్షన్ ఇచ్చారు. తాగునీటి సమస్యను వెటనే తీర్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇబ్బందులు ఉన్నాయ్
పాఠశాలలో తాగునీటి కోసం విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నా రు. మధ్యాహ్న భోజన సమయంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు రెండేం డ్లుగా వాటర్ లేదు. దుకాణంలో నుంచి వాటర్ క్యాన్ తెప్పిస్తున్నాం.