గతంలో దొంగతనం కేసులో జైలుకు ..
తిరిగొచ్చాక కొడుకుకు హోటల్ పెట్టించిన తండ్రి
లాక్డౌన్లో నడువక మళ్లీ వక్రమార్గంలో..
భూపాలపల్లి కేసు సహా నిందితుడిపై 16 కేసులు
తాజాగా దొంగతనాల కేసుల్లో యువకుడి అరెస్టు
రౌడీషీట్ ఓపెన్ చేస్తాం : డీఎస్పీ సంపత్‌రావు వెల్లడి
భూపాలపల్లి, ఆగస్టు 23 : జల్సాలకు అలవాటుపడి దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు.. తిరిగి ఇంటికి వచ్చి న కొడుకును మార్చేందుకు సింగరేణి ఉద్యోగి అయిన తండ్రి శంకర్ అతడికి హోటల్ పెట్టించాడు. దీంతో కొద్ది రోజులుగా హోటల్ నడుపుతూ బుద్ధిగా ఉన్నాడు. కరో నా సమయంలో హోటల్ సరిగా నడవకపోవడంతో ఆర్థి క ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తనకు అనుభవం ఉన్న చోర కళకు పని చెప్పాడు. దొంగతనాలకు పాల్పడుతూ మళ్లీ పోలీసులకు చిక్కాడు.. ఇందుకు సం బంధించిన వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించా రు. జయశంకర్ భూపాలపల్లి ఫకీర్గడ్డకు చెందిన దరిశెట్టి స్వామినిరంజన్ హనుమకొండలో విద్యనభ్యసిస్తున్న క్రమంలో జల్సాలకు అలవాటుపడి దొంగతనాల కు పాల్పడేవాడు. అనంతరం భూపాలపల్లిలోని ఓ సెల్‌షాపులో దొంగతనం చేసి పోలీసులకు చిక్కడంతో హనుమకొండలో చేసిన చోరీలు వెలుగుచూడడంతో అప్పట్లో జైలుకు వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత విడుదలయ్యా డు. నేరప్రవర్తన కలిగిన కుమారుడు సత్ప్రవర్తనతో మేదలాలనే ఉద్దేశంతో సింగరేణి ఉద్యోగైన తండ్రి స్వామినిరంజన్కు హోటల్ పెట్టించడంతో పాటు కిరాయిలకు వెళ్లేందుకు కారు కొనిచ్చాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగా అమ్మ హోటల్ నడుపుతూ భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే కరోనా వచ్చిపడడంతో హోటల్ సరిగా నడువక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.
దీంతో తనకు అనుభవమున్న దొంగతనాలవైపు మళ్లాడు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ స్వామినిరంజన్ పోలీసులకు చిక్కాడు. అతని నుంచి పోలీసులు కారు, ద్విచక్ర వాహనం, వెండి, బంగారు అభరణాలు, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు భూపాలపల్లి, పోత్కపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖనితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించడం, రాత్రిపూట దొంగతనాలు చేసి, ఆ కేసుల్లో జైలుకు వెళ్లి, బెయిల్‌పై తిరిగి వచ్చాడు. ప్రస్తుతం భూపాలపల్లిలో అమ్మ మెస్ నడుపుతున్న క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఈ నెల 13న రాత్రి గోదావరిఖనిలోని పోతన కాలనీలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగలించి భూపాలపల్లిలోని తన ఇంటి వెనకాల దాచిపెట్టాడన్నారు. 20న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గణపురం మండల పరిధిలోని యైటిైంక్లెన్ కాలనీ (వెయ్యి క్వార్టర్ల సముదాయం)లో ఎవరూ లేని సమయంలో 1005 నంబర్ గల క్వార్టర్లో తాళం పగలగొట్టి బీరువాలోని వెండి కుంకు మ భరణి, రెండు బంగారు చెంచాలు, ఒక సోని కెమెరా ను దొంగలించాడు. అదే రాత్రి భూపాలపల్లికి 4.30 గం టల సమయంలో వచ్చి రెడ్డికాలనీలో ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్‌ను దొంగిలించాడని డీఎస్పీ వెల్లడించారు. వాటిని అతని ఇంటి వద్ద దాచిపెట్టాడన్నారు.
డబ్బులకు ఇబ్బంది కావడంతో సోమవా రం ఉదయం 10 గంటల సమయంలో దొంగిలించిన ద్విచక్రవాహనంపై చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు హనుమకొండకు వెళ్తున్న క్రమంలో మంజూర్‌నగర్ వద్ద సీఐ వాసుదేవరావు, ఎస్సై అభినవ్‌కు పట్టుబడ్డాడన్నా రు. కేసును త్వరగా ఛేదించిన సీఐ, ఎస్సై, వీరికి సహకరించిన ఎస్సై నరేశ్‌ను, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇదిలాఉండగా భూపాలపల్లి, గణపురం, గోదావరిఖనిలో ప్రస్తుతం నమోదైన మూడు కేసులతో పాటు ఇదివరకు స్వామినిరంజన్పై 13 కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిపై రౌడీషీట్‌ను కూడా ఓపెన్ చేయనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో భూపాలపల్లి సీఐ వాసుదేవరావు, ఎస్సై అభినవ్ పాల్గొన్నారు.