భూపాలపల్లి రూరల్/కాటారం/మంగపేట/ములుగు రూరల్/గోవిందరావుపేట/చిట్యాల/వెంకటాపూర్/డిసెంబర్ 22: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బుధవారం గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యా సంస్థల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్, శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ రూప ఆధ్వర్యంలో రామానుజన్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు రామానుజన్ స్ఫూర్తితో విద్యను అభ్యసించి, ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు కాంక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గౌరి, గణిత శాస్త్ర అధ్యాపకులు ఆర్.శ్రీధర్, అకాడమిక్ కో ఆర్డినేటర్ ఈ.కవిత, శ్రీ చైతన్య పాఠశాల ప్రైమరీ ఇన్చార్జి ఎం.విజయలక్ష్మీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాటారం మండలం లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు 1729 నంబర్ ఆకారంలో కూర్చొని ప్రదర్శించారు. కాటారం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ప్రిన్సిపాల్ రాజేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మ్యాథ్స్ ఫేర్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్లా సునీత, గురుకుల వైస్ ప్రిన్సిపాల్ సిరిసిల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్ అధ్యక్ష గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. గణిత అధ్యాపకుడు రాజశేఖర్‌ను శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులు గొప్ప సమ్మారావు, పాపయ్య, సంపత్, బుచ్చయ్య, నాగేశ్వర్రావు, వరలక్ష్మి, స్వప్న, ప్రేమ్‌సాగర్, రంజిత్ పాల్గొన్నారు.
ములుగు డీఈఓ కార్యాలయంలో గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి ఏఎంఓ బద్దం సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహించిన రామానుజన్ జయంతి కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలలవేసి నివాళులర్పించారు. గోవింద రావుపేటలో గణిత దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎల్.ఆజాద్, రాజ్‌కుమార్, లహరిలను చల్వాయి మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ నిజామోద్దీన్ అభినందించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే క్విజ్ పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చాలని సూచించారు. చిట్యాల మండలం కాకతీయ హైస్కూల్, వాణి విద్యాకేతన్ హైస్కూల్లో రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు. గణిత కృత్యమేళ, ముగ్గుల పోటీలు, వక్తృత్వ పోటీలు, డాన్స్ పోటీలు ఆయా పాఠశాలలో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంపత్‌కుమార్, ఎండీ రాజమహ్మద్ , ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలంలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ గండు కుమార్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. విదార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, క్విజ్, రంగోలి, డాన్స్ పోటీలు నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు దివ్య, రాజమౌళిలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. క్వాలిటీ కంట్రోల్ కో ఆర్డినేటర్ బద్ధం సుదర్శన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు శ్రీధర్, కరుణాకర్, రవీందర్, పాల్గొన్నారు.