జనగామ చౌరస్తా, డిసెంబర్ 21 : జిల్లాలో వందశా తం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యే చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం జనగా మ పట్టణ కేంద్రంలోని ఒకటో, రెండో వార్డులో సంచార జాతుల వారికి వేస్తున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని ప్రజలందరూ విధిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ పీ సుగుణాకర్‌రాజు, వార్డు స్పెషలాఫీసర్ రోజారాణి, వైద్య సిబ్బంది రమాదేవి, అంగన్వాడీ కార్యకర్త అనిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలి
లింగాలఘనపురం: మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి, జిల్లాలో మొదటి వరుసలో నిలుపాలని సిబ్బందికి మండల వైద్యాధికారి కరుణాకర్‌రాజు అన్నారు.. లింగాలఘనపురంలో నిర్వహిస్తున్న టీకా కా ర్యక్రమాన్ని ఆయన మంగళవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొద టి విడుతలో 28,961 మందికి టీకాలు వేయాల్సి ఉండగా, 14,768 మందికి వేశామన్నారు. మిగిలిన 14,193 మందికి ఈ వారంలో వేసి మొదటి విడుత వందశాతం పూర్తి చేస్తున్నామన్నారు. మండలంలో మంగళవారం మొదటి విడుతలో మిగిలిన 25 మందికి, రెండో విడుతలో 407 మందికి టీకాలు వేశామన్నారు. ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించి భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. సర్పంచ్ సాదం విజయమనోహర్, ఎంపీవో మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్రావు, ఏఎన్ఎం స్వరూప, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.