సీఎం కేసీఆర్‌తోనే అని వర్గాల సంక్షేమం
ఏడేళ్లుగా క్రైస్తవులకు కానుకలు
భూపాలపల్లి నియోజకవర్గానికి వెయ్యి మంజూరు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చర్చిల నిర్మాణానికి రూ.77 లక్షలు
జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లిలో క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సమన్యాయం చేస్తున్నదని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మం గళవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాశ్‌కాలనీ బేతాస్త చర్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికా రి బుర్ర సునీత ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిరుపేద క్రైస్తవులకు అందజేస్తున్న గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్ర మం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగు ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరై పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద క్రైస్తవులు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవి స్తూ వారి సంక్షమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రతి నియోజక వర్గానికి వెయ్యి గిఫ్ట్‌లు పంపించారని, భూపాలపల్లి నియోజకవర్గంలో ఎ క్కువ మంది క్రిష్టియన్లు ఉన్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లగా మరో 1500 పంపిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
చర్చిల కోసం రూ.77 లక్షలు మంజూరు
జిల్లాలో చర్చిల నిర్మాణం, మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్ర భుత్వం రూ.77 లక్షలు మంజూరు చేసిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. అక్కడక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ప విత్రంగా జరుపుకుంటారని, గత ఏడాది కరోనా కారణంగా నామమాత్రంగా జరుపుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు బాగున్నందున జిల్లాలోని క్రిస్టియన్లు పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం గిఫ్ట్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర పేద క్రైస్తవులకు దుస్తులు పం పిణీ చేశారు. కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, ఆర్డీవో శ్రీనివాస్, భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్, జిల్లా కమిటీ అధ్యక్షులు రాజీవ్ ఫాస్టర్, ఏడు మండలాల తహసీల్దార్లు, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.