–డీఏవో కేఏ గౌస్‌హైదర్
ములుగురూరల్, జనవరి11: దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఆదర్శంగా నిలిచిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కేఏ గౌస్‌హైదర్ అన్నారు. మంగళవారం ములుగులోని రైతు వేదికలో రైతు బంధు సంబురాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కేశెట్టి కుటుంబరావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్, ఏడీఏ శ్రీపాల్, ఏవో సంతోష్ పాల్గొన్నారు.
సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
ఏటూరునాగారం: స్థానిక నందమూరి నగర్‌లోని పంట పొలాల్లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ వలియాబీ, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఖాజాపాషా, రైతు బంధు సమితి అధ్యక్షుడు దన్నపునేని కిరణ్, ఎంపీటీసీ కుమ్మరి స్వప్న, సర్పంచ్ దొడ్డ కృష్ణ, నాయకులు రాంనర్సయ్య, కాళ్ల రామకృష్ణ, జాడి భోజారావు, చిప్ప నాగరాజు, శ్రీనువాస్, రాజు, సంపత్‌రావు, ప్రమోద్ పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
గోవిందరావుపేట: రైతు బాంధువుడు సీఎం కేసీఆర్ అని ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దుంపిల్లగూడెం గ్రామంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు మండల శాఖ అధ్యక్షుడు సూరపనేని సాయిబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి రాజశేఖర్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నర్సింహానాయక్, నాయకులు నెమలి బాలకృష్ణ, సూదిరెడ్డి లక్ష్మారెడ్డి, బాబర్, సురేశ్, రాంబాబు, హన్మంతరావు, మల్లేశ్ గౌడ్, గట్టయ్య, సంతోష్, మహేందర్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న రైతు బంధు సంబురాలు
వెంకటాపూర్: లక్ష్మీదేవిపేట గ్రామంలో రైతు బంధు సంబురాలు మండల అధ్యక్షుడు లింగాల రమణారెడి, పార్టీ జిల్లా నాయకులు పోరిక గోవింద్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పత్తిరి లక్ష్మీదశరథం, పోశాల అనిత వీరమల్లు, సర్పంచ్‌లు మందల సుచరిత శ్రీధర్‌రెడ్డి, కుమారస్వామి, ఉప సర్పంచ్‌లు కరుణాకర్, హరీశ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు వీరగాని సాంబయ్య, దళిత సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బొచ్చు సమ్మయ్య, జాగృతి జిల్లా అధికార ప్రతినిధి అవతటి రాము, నాయకులు తండ రమేశ్, రాజ్‌కుమార్, జ్ఞానేందర్, సాంబయ్య పాల్గొన్నారు
కన్నాయిగూడెంలో..
కన్నాయిగూడెం మండల కేంద్రంలో పల్లా బుచ్చయ్య, రైతులు, టీఆర్ఎస్ నాయకులు మిర్చి కల్లాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కావిరి చిన్నికృష్ణ, మధుకర్, రాంబాబు, ప్రభాకర్, నారాయణ, వెంకటేశ్, మేడారం ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్ పొడెం శోభన్, వెంకటయ్య, సుమన్, నాగ మల్లయ్య పాల్గొన్నారు.