వర్ధన్నపేట, జనవరి 11: నిరుపేద కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట మండలానికి చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ. 5,65,500 విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుదన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని వేలమందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే, వర్ధన్నపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త శ్రీరాముల నాగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బీమాకు సంబంధించిన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి అందించారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అరూరి అన్నారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ అల్లమనేని మోహన్‌రావు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆయనను, దమ్మన్నపేటకు చెందిన చొప్పరి కాంతయ్య మృతి చెందగా, అతడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అరూరి వెంట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, కౌన్సిలర్లు, ఉన్నారు.