వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 10: హెలికాప్టర్ ప్రమాదంలో దేశం భద్రతా దళాధికారులను కోల్పోవడం బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ బైరం బాలాజీ అన్నారు. శుక్రవారం వరంగల్ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరులైన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులతోపాటు సైనికాధికారులకు నివాళులర్పించారు. సర్జికల్ స్ట్రైక్‌లో ఆరితేరిన రావత్ నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్ల సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగార్జునరెడ్డి, కోశాధికారి డాక్టర్ సనత్‌కుమార్, జాతీయ మాజీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కస్తూరి ప్రమీల, ఐఎంఏ హెల్త్ స్కీమ్ చైర్మ న్ డాక్టర్ బందెళ మోహన్‌రావు, మాజీ కార్యదర్శి డాక్టర్ మన్మోహన్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పవన్, డాక్టర్ భరత్ పాల్గొన్నారు.
అమర జవానులకు కొవ్వొత్తులతో నివాళి
గీసుగొండ/సంగెం/మట్టెవాడ: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మృతి దేశానికి తీరానిలోటని దూరవిద్య కో ఆర్డినేటర్ శ్రీకాంత్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో రావత్ చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. విద్యార్థులు హరి, చందు, రాజు, సురేశ్, హరినాథ్, కార్తీక్, శ్రీకాంత్, పవన్ పాల్గొన్నారు. రావత్ దంపతులతోపాటు ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారులకు సంగెం మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, తెలంగాణ జాగృతి పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు మునుకుంట్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం, పులి రాజశేఖర్, పులి వీరస్వామి పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటకు చెందిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావత్ దంపతులు, తెలుగు జవాన్ సాయితేజకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రవణ్, శ్రీకాంత్, అజయ్, వేణు, క్రాంతి, ఆనంద్, మాధవి, రమ్య పాల్గొన్నారు.