ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పన
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
సమస్యల పరిష్కారానికి కృషి
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కరీమాబాద్, జనవరి 9 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, మంత్రి కేటీఆర్ అండదండలతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. డివిజన్లో పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పోశాల స్వామి, కలకోట్ల రమేశ్, బొల్లం సంజీవ్, బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ది వరంగల్ పాన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే నన్నపునేని శాంతినగర్‌లోని రాజశ్రీ గార్డెన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేందర్, సోమిశెట్టి ప్రవీణ్, పాన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొళ్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శి వీరన్న, ఉపాధ్యక్షుడు ఉప్పుల చంద్రమౌళి యాదవ్, కోశాధికారి సయ్యద్మీరా హుస్సేన్, సహాయ కార్యదర్శి అచ్చ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
వరంగల్ చౌరస్తా : 24వ డివిజన్ పరిధి మట్టెవాడ ప్రాంతానికి చెందిన సింగారం జయమ్మ, గాజుల అనసూయ ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబాలను ఎమ్మెల్యే నన్నపునేని పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు ఆకుతోట శిరీష్ తదితరులు ఉన్నారు.