గ్రామగ్రామాన ‘రైతుబంధు’ వేడుకలు
పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు
రైతులకు అండగా సీఎం కేసీఆర్
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
కరీమాబాద్, జనవరి 9: రైతుబంధు సంబురాల్లో భాగంగా వరంగల్ 43వ డివిజన్ గణేశ్‌నగర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారన్నారు. తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం జమ చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే గణేశ్‌నగర్‌లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి మున్నూరుకాపు పరపతి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణ, గుండు చందన, నాయకులు నోముల వెంకట్‌రెడ్డి, గుండు పూర్ణచందర్, ఇనుగాల జోగిరెడ్డి, గణేశ్నగర్వాసులు పాల్గొన్నారు.
ఎడ్లు, మేకల బండ్ల ర్యాలీలు
సంగెం: మండలంలో రైతుబంధు సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. డప్పుచప్పుళ్లతో మొండ్రాయిలోని వీధుల్లో ఎడ్ల బండి ర్యాలీని, గొల్లపల్లిలో మేకల బండి ర్యాలీని జై కేసీఆర్.. నినాదాలతో నిర్వహించారు. మేకల బండికి సీఎం కేసీఆర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫ్ల్లెక్సీని ఏర్పాటు చేశారు. మొండ్రాయి నేతాజీ సెంటర్ నుంచి ఎడ్లబండి ర్యాలీ, గొల్లపల్లి కూడలి నుంచి మేకల బండి ర్యాలీ ప్రారంభమైంది. యాదవులు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ర్యాలీ తీశారు. అలాగే, మొండ్రాయి రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ నరహరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, ఇజ్జగిరి స్వప్న, రజిత, కక్కెర్ల కుమారస్వామి, ఎంపీటీసీ కొనకటి రాణి-మొగిలి, ఉపసర్పంచ్ పెండ్లి శారద-కుమారస్వామి, నాయకులు కడ్దూరి సంపత్, గండ్రకోటి రవి, అనుముల ప్రతాప్, అనుముల చంద్రమౌళి, బాబు కొమ్మాలు, కన్నెబోయిన రాజు, పురుషోత్తం, ప్రవీణ్, మన్సూర్ అలీ పాల్గొన్నారు. అలాగే, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలు, గ్రామ కూడళ్లలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను తెలియజేసే ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గులను ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, నరహరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పరిశీలించారు.
అన్నివర్గాలకూ సంక్షేమ ఫలాలు
గీసుగొండ: మండలంలోని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు చిక్కుడు కాయలను ‘రైతుబంధు సంబురాలు’ ఆకారంలో పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో బిందు, కొనాయిమాకుల సర్పంచ్ డోలి రాధబాయి, రైతులు పాల్గొన్నారు.
అన్నదాతల కండ్లల్లో ఆనందం..
రాయపర్తి: రాష్ట్రంలోని అన్నదాతల కండ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లిలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాట్రపల్లి క్లస్టర్ పరిధిలోని ఆరెగూడెం, కొలన్‌పల్లి, జయరాంతండా(కే), వాం కుడోత్తండా, పోతిరెడ్డిపల్లి, ఊకల్‌కు చెందిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు కాట్రపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటాలు, డీజే నడు మ నృత్యాలు చేస్తూ రైతు వేదిక భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆవరణలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో పంటల సాగు కోసం సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నారని కొనియాడారు. ఎనిమిది విడుతల్లో మండలంలోని రైతుల ఖాతాల్లో రూ. 140 కోట్లు జమ అయినట్లు వివరించారు.
అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, ఏవో గుమ్మడి వీరభద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, పీఏసీఎస్ చైర్మన్లు కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్‌రెడ్డి, పూస మధు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బోనగిరి ఎల్లయ్య, బిజ్జాల సంధ్య-సోమనాథం, భూక్యా క్రాంతి, పెండ్లి రజినీసుధాకర్రెడ్డి, ఉండాడి సతీశ్‌కుమార్, ఎండీ నయీం, గబ్బెట బాబు, కాంచనపల్లి వనజారాణి, నవల, జయశ్రీ, నాగపురి రాంబాబు, కత్తి యాకయ్య, కునుసోత్ సజ్జన్, తిరుమల మాడభూషణ రంగాచార్యులు, కత్తి సోమన్న, గుమ్మడిరాజుల శ్రీనివాస్, ఆశ్రఫ్పాషా, నాగరాజు, తిర్మల్, అయిత రాంచందర్, చందు రామ్‌యాదవ్, మచ్చ సత్యం పాల్గొన్నారు.