రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం
స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
లింగాలఘనపురం, జనవరి 9 : పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పంటల పెట్టుబడి కోసం తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రాజయ్య మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడిందని గుర్తు చేశారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన సీఎం కేసీఆర్ గోదావరి జలాలను బీడు భూములకు అందిస్తూ సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు బొల్లంపెల్లి నాగేందర్, బోయిని రాజు, ఉడుగుల భాగ్యలక్ష్మి, మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బుషిగంపల ఆంజనేయులు, బూడిద రాజు, కరుణాకర్, గవ్వల మల్లేశం, మర్రి భాస్కర్‌రెడ్డి, ఆగారెడ్డి, శ్రీహరి, యాదగిరి, కేమిడి కవితావెంకటేశ్, కిరణ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం
స్టేషన్‌ఘన్‌పూర్ :మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోషల్ మీడియా వారియర్స్ ఆదివారం ధాన్యాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు ముగ్గులు వేశారు. రాజయ్య మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా వారియర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రంగు రమేశ్, టీ చిరంజీవి, బాధ్యులు దీకొండ శ్యామల, జోగు వినయ్, తిప్పారపు రమ్య, జస్వంత్. కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, ఎంపీటీసీలు గన్ను శ్రీనివాస్, గుర్రం రాజు, సమ్మక్క జాతర చైర్మన్ అజయ్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసుబాబు, విశ్వనాథపురం గ్రామ అధ్యక్షుడు గుర్రం నర్సిం హ, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, మారపల్లి ప్రసాద్, చాగల్లు గ్రామ యూత్ అధ్యక్షుడు పొన్న రాజేశ్, మా ర్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, నియోజకవర్గ మహిళా ఇన్చార్జి మడ్లపల్లి సునీత, రఘునాథపల్లి మండల మహిళా విభాగం ఇన్చార్జి తిప్పారపు మమత, తిప్పారపు అ మృత, రైతు సమన్వయ సమితి సభ్యురాలు ఎడ్ల అమృ త, స్వాతిరెడ్డి, అధికార ప్రతినిధి జ్యోతిరెడ్డి, నాగపురి పావని, గుండె మల్లేష్, గుర్రం ఏసుబాబు, కట్ల జగన్ పాల్గొన్నారు.