రైతుబంధు వారోత్సవాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య
వేలేరు, జనవరి 9: రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల స్థితిగతులను ప్రతిబింబించే విధంగా మహిళలు ఆదివారం వేసిన ముగ్గులను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే రైతులకు రైతు బంధు సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, ఆత్మ జిల్లా చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు నర్సింహారావు, కుడా డైరెక్టర్ బిల్లా యాదగిరి, వైస్ ఎంపీపీ సంపత్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్, మండల యూత్ ఇన్చార్జి ఇట్టబోయిన సంపత్, మల్లన్న ఆలయ చైర్మన్ రవియాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్ : మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రైతు బంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం వరకు ఎమ్మెల్యే ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి కీర్తన, రెండో బహుమతి సీహెచ్ మాధవి, మూడో బహుమతి యమున, మిగిలిన వారికి ప్రోత్సాహక బహుమతులను ఎమ్మెల్యే రాజయ్య, జేడీఏ ఉషాదయాళ్, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏవో ఎల్ పద్మ అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. రైతులు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రం రాకముందు రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం ఎలా ఉందో ఒక్కసారిగా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎంపీపీ నిమ్మ కవిత, జడ్పీటీసీ డాక్టర్ పిట్టల శ్రీలత, వైస్ ఎంపీపీ బండారి రవీంర్, వైస్ చైర్మన్ యాదకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ కరంచంద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ మునిగెల రాజు ముదిరాజ్, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు జుబేదాలాల్ మహ్మద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, సర్పంచ్‌లు శరత్, మామిడి రవీందర్ యాదవ్, మునిగాల శోభ, తోట మంజుల, ఎంపీటీసీలు శోభ, పెద్ది శ్రీనివాస్, నాగయ్య, శశిరేఖ, నాయకులు కరుణాకర్, ప్రభుదాసు, రమేశ్, రఘు, కుమార్, లక్క శ్రీనివాస్, మహేశ్, బాలస్వామి, గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.