అభివృద్ధిలో దేశానికే దిక్సూచి తెలంగాణ
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
50వ డివిజన్లో రూ.కోటితో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
న్యూశాయంపేట, జనవరి 9 : సీఎం కేసీఆర్ పేదలకు అండగా ఉన్నారని పభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దీన్‌దయాళ్‌నగర్ కాలనీ చెందిన ఓర్సు శ్రీశైలం కుటుంబ సభ్యులకు ఆదివారం రూ.ఐదు లక్షల చెక్కును అందజేశారు. అనంతరం న్యూ బృందవన్ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ నుంచి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయించి ఓర్సు శ్రీశైలం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కరోనాతో ఇబ్బందులు ఏర్పడినా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. 60 ఏళ్లుగా జరుగని అభివృద్ధి ఏడేళ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. 50వ డివిజన్లోని పలు కాలనీల్లో కోటి రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కుడా డైరెక్టర్ మాడిశెట్టి శివశంకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.