ఖానాపురం, జనవరి 8 : రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్ గొర్రె కవిత, రవి, రైతుబంధు బంధు గ్రామ కన్వీనర్ గంగాధర రమేశ్, ముద్దంగుల సంపత్, రాంబాబు, కల్లెపు వెంకటనారాయణ పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి: రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని లక్ష్మీపురం, మందపల్లి, మల్లంపల్లి రైతు వేదిక వద్ద వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేశారు. రేఖంపల్లి, మర్రిపల్లి, తిమ్మంపేట, బొబ్బరోనిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట, జనవరి 8 : నల్లబెల్లి గ్రామంలో సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఇల్లందలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ప్రజాప్రతినిధులు, రైతులు పొలాల్లో నాట్లు వేసి కేసీఆర్‌కు జైకొట్టారు. నారుతో కేసీఆర్ అనే అక్షరాలు రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డీసీ తండా వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి, జనవరి 8 : పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలంలోని కేశవాపురం క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు, ర్యాలీ నిర్వహించాయి. రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జడ్పీటీసీ రంగు కుమార్, పూస మధు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, రైతుబంధు సమితి ప్రతినిధులు చిలుముల్ల ఎల్లమ్మ, గజవెల్లి అనంత ప్రసాద్, కర్ర సరిత, సూదుల దేవేందర్‌రావు, లావుడ్యా చిరంజీవి, గుగులోత్ సుందర్నాయక్, పెండ్లి రజనీ సుధాకర్‌రెడ్డి, గుగులోత్ బీకోజీనాయక్, గుడి యుగేంధర్‌రెడ్డి, మహబూబ్‌రెడ్డి, మొలుగూరి పున్నమయ్య, గోలి ఇంద్రారెడ్డి, చిర్ర కిశోర్‌కుమార్, ముత్తడి సాగర్‌రెడ్డి, గుగులోత్ జాజునాయక్, బాషబోయిన సుధాకర్, మహ్మద్ ఆశ్రఫ్పాషా, సత్తూరి నాగరాజు, గూడెల్లి తిర్మల్, చిన్నాల రాజబాబు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కరీమాబాద్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు అన్నారు. తిమ్మాపూరంలో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ అరుణతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నోముల వెంకట్‌రెడ్డి, ఇనుగాల జోగిరెడ్డి, షకీల్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం ‘రైతుబంధు’
గీసుగొండ : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని కొమ్మాల సర్పంచ్ వీరాటి కవిత అన్నారు. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, అనంతారం, నందనాయక్తం డా, దస్రుతండా, సూర్యతండాలోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కొ మ్మాల పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్‌బాబు, రైతుబంధు సమితి కన్వీనర్ రవీందర్‌రెడ్డి, దూడె మొగిలి పాల్గొన్నారు.