అందరికీ అందుబాటులో వైద్య సేవలు
ఇక ఆక్సిజన్‌కు కొరత ఉండదు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభం
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 7 : జిల్లా దవాఖానను త్వరలోనే సకల హంగులతో ప్రారంభించనున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటు (500 ఎల్పీఎం)ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వార్డు ల్లో తిరుగుతూ బాలింతలతో మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి? వైద్యులు, సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గండ్ర మా ట్లాడుతూ కరోనాతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, దీంతో ప్రభుత్వం అన్ని వైద్యశాలల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొ రత లేదన్నారు. వంద పడకల దవాఖాన (జిల్లా వైద్యశాల)లో తాత్కాలిక సేవలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే వైద్యులను నియమించి ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు బండారి రవి పాల్గొన్నారు.