క్రీడలను విజయవంతం చేయాలి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హనుమకొండ, సెప్టెంబర్ 6: ఈ నెల 15వ తేదీ నుంచి 19 వరకు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడి యంలో నిర్వహించనున్న 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో అథ్లెటిక్స్ అసోసి యేషన్ జిల్లా చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు అధ్యక్ష తన ఏర్పాటు చేసిన జాతీయస్థాయి క్రీడా పోటీల లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ చారిత్రక వరంగల్‌లో ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు జరుగడం మనకు గర్వకారణమన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు కూడా జిల్లా యంత్రాంతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంత రం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లా డుతూ ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేలా టూరిజం శాఖతో చర్చలు జరుపు తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడు తూ గతంలో వరంగల్‌లో జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించిన సమయంలో తాను ఇక్కడ విధులు నిర్వర్తించానని తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్జోన్స్, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, హనుమకొండ జిల్లా డీవైఎస్వో జీ అశోక్‌కు మార్, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, ఉపాధ్యక్షుడు పీ రమేశ్‌రెడ్డి, భారత అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, షైన్ విద్యా సంస్థల చైర్మన్ కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.