రేగొండ, జనవరి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం పంటలు, సిరి సంపదలతో కళకళలాడుతున్నదని భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడి అన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామం నుంచి రేగొండ మండలకేంద్రం వరకు జాతీయ రహదారిపై ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర ర్యాలీని ప్రారంభించారు. ట్రాక్టర్ నడుపుతూ రేగొండ వరకు చేరుకున్నారు. అనంతరం ఎడ్ల బండిలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల మరమ్మతులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమలుచేస్తూ చరిత్ర సృష్టించారని కొనియాడారు. పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్‌రావు, ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ సాయిని విజయ, ఆలయ చైర్మన్ ఇంగే మహేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెం ఉమేష్‌గౌడ్, కోల్గురి రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రావు, కుసుంభ రంజిత్, పాతపెల్లి సంతోష్, ఎంపీటీసీలు ఐలి శ్రీధర్, కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సామల పాపిరెడ్డి, కోలెపాక భిక్షపతి, గంజి రజినీకాంత్, కిరణ్ ఉన్నారు.
భూపాలపల్లి రూరల్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మూడేండ్లలో పూర్తిచేసి తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
రైతుబంధు సంబురాల్లో భాగంగా భూపాలపల్లి మాంటిస్సోరీ పాఠశాలలో టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకుడు బుర్ర రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర హాజరై మాట్లాడారు. రైతుబంధుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయభాస్కర్, భూపాలపల్లి మండలం ఎంపీపీ లావణ్య, గణపురం జడ్పీటీసీ విజయ పాల్గొన్నారు. కాగా, రేగొండ మండలం గూడెపల్లె గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్ లింగంపెల్లి ప్రసాద్‌రావు, అంకం రాజేందర్, మోడెం ఉమేష్‌గౌడ్, కోల్గురి రాజేశ్వర్‌రావు, పెరుమాన్ల మహేందద్గౌడ్, గంజి రజినీకాంత్ ఉన్నారు.
రైతు బంధు వారోత్సవాల్లో పలిమెలలోని రైతు వేదికలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహంచారు. ఏఈఓ పృథ్వీరాజ్, ఏల్‌హెచ్ స్వామి, పలిమెల, ముకునూరు, సర్వాయిపేట, దమ్మూర్ సర్పంచులు జవ్వాజి పుష్పలత, ఆలం సత్యనారాయణ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వ్యాసరచన పోటీలను పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్దన్, మహిళా అధ్యక్షురాలు సుజాత నిర్వహించారు. ఏవో రామకృష్ణ, రైతుబంధు కోఆర్డినేటర్ రాజబాపు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహాముత్తారం మండలం స్తంభంపల్లి పీపీ రైతువేదికను ముస్తాబు చేశారు. ఏఈవో శివకృష్ణ, పాల్గొన్నారు.